ఈ మధ్య కాలంలో సినిమాల పబ్లిసిటీ కోసం హీరోలు, దర్శకనిర్మాతలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.అయితే కొన్నిసార్లు ఈ కొత్త మార్గాల వల్ల దర్శకనిర్మాతలకు బెనిఫిట్ కలుగుతుంటే మరి కొన్నిసార్లు మాత్రం ఆ పబ్లిసిటీ సినిమాలకు మైనస్ అవుతోంది.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
వచ్చే నెల 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా లైగర్ పోస్టర్ రిలీజ్ కాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.చాలామంది ఈ పోస్టర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ ను పూరీ జగన్నాథ్ కావాలని వదిలారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడంతో పూరీ జగన్నాథ్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్ ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయించి ఈ పోస్టర్ ను వదిలారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.లైగర్ సినిమా గురించి నలుగురు మాట్లాడుకునేలా చేయాలని భావించి ఈ పోస్టర్ ను పూరీ జగన్నాథ్ రిలీజ్ చేశారని తెలుస్తోంది.
అయితే ఈ పబ్లిసిటీ సినిమాకు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.పోస్టర్ ను రిలీజ్ చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ చాలామంది సెలబ్రిటీలతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయించారు.
పూరీ జగన్నాథ్ మెసేజ్ లు పెట్టి, ఫోన్ లు చేసి హీరోయిన్లతో ప్రమోషన్స్ చేయించారు.అయితే రిలీజ్ చేసిన పోస్టర్ అటు పూరీ జగన్నాథ్ స్థాయికి ఇటు విజయ్ దేవరకొండ స్థాయికి తగిన విధంగా లేదని పబ్లిసిటీ కోసం ఈ తరహా పోస్టర్ ను రిలీజ్ చేసి తప్పు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి దారుణంగా ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.