బ్రాండ్ అంబాసిడర్స్( Brand Ambassadors ) అనే మాటను మీరు అపుడపుడూ వినే వుంటారు.ఇక సినిమా ప్రియులకైతే ఈ మాట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే వారి వారి అభిమాన హీరోలు ఎటువంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారో వారికి బాగా తెలుసును.ప్రత్యేకించి వాటిని ఫాలో అయిన వారు కూడా లేకపోలేదు.
ఒక పేరుమోసిన హీరో ఏదైనా ప్రొడక్టును లాంచ్ చేసాడంటే ఇక అది మార్కెట్లో వేలం వెర్రిగా అమ్ముడు పోవలసిందే… అది ఆరోగ్యానికి మంచిదైనా, హానికరం చేసేదైనా! ఒక పెద్ద సెలిబ్రిటీ( Celebrities ) పనిగట్టుకొని ఒక బ్రాండుని అలా ప్రమోట్ చేస్తే జనాలపై అది ఎటువంటి ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే.జనాలు గుత్తకట్టుకొని మరీ వాటిని కొనడానికి క్యూలు కడతారు.
మనం కూడా ఆ గుంపులోని వారమే.
అయితే ఆ బ్రాండ్స్ అనేవి నిన్న మొన్నటి వరకూ ఒక కోవకు చెందినవి మాత్రమే ఉండేవి.ఇపుడు దురదృష్టకరం ఏమిటంటే? కొన్ని రకాల ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా గ్లామర్ ని వాడుకుంటున్న మహానుభావులు వున్నారు.అవును, నేటి పాపులర్ హీరోయిన్ శ్రీలీల( Heroine Sreeleela ) గురించి ఇక్కడ తెలియని వారు వుండరు.
ఆమెని తాజాగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు( Sri Chaitanya Educational Institutions ) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది.ఆ విషయాన్ని గ్రూపు యాజమాన్యమే ప్రకటించింది.
ఈ క్రమంలోనే అసలు ఒక సినిమా హీరోయిన్ ఒక విద్యాసంస్థల గ్రూపుకి బ్రాండ్ అంబాసిడర్ ఏమిటి? అనే ప్రశ్నలు ఇపుడు చాలామంది మదిలో మెదులుతున్నాయి.
ఒక సినిమా తారను చూసి తమ పిల్లల్ని కాలేజీల్లో చేర్పించాలా? నేటి విద్యావ్యవస్థ( Education System ) ఎటు పోతోంది? అనే ప్రశ్నలు కొంతమంది తల్లిదండ్రలు బాహాటంగానే అడుగుతున్నారు.అసలు ఒక కాలేజీలో ఏం చూసి పేరెంట్స్( Parents ) తమ పిల్లల్ని చేర్పించాలి? విలువైన చదువు, క్రమశిక్షణ, విలువలే కదా.మరి ఇలాంటివి జరిగినపుడు పిల్లలు ఎవరిని ప్రేరణగా తీసుకుంటారు? సినిమా వాళ్ళనా? అలాగైతే వారి గతి ఏమౌతుంది? అని విద్యావంతులు మాట్లాడుతున్నారు.ఈ విషయం సో కాల్డ్ విద్యా సంస్థలు అయితే ఆలోచించుకోవాలి.అదేవిధంగా సినిమా తారలయినా( Celebrities ) డబ్బు వస్తోంది కదాని దేనికి బడితే దానికి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా మారితే చాలా తీవ్రమైన పరిణామాలు వుంటాయని ఓ వర్గంవారు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇలాంటివి కొత్తేమి కాదు.గతంలో కూడా ఎంతోమంటి టాలీవుడ్ బాబులు ఇలాంటి ఘనకార్యాలు చేసిన దాఖలాలు వున్నాయి.ఏదిఏమైనప్పటికీ స్టార్స్ అనేవారికి కూడా సామజిక బాధ్యత ఉండాలనేది విద్యావంతుల మాట! దీనిపై మీ కామెంట్ ఏమిటి?
.