Anupama Parameswaran : ఇలాంటి పాత్ర చేయాలంటే అనుపమలా గట్స్ ఉండాలి.. ఏ హీరోయిన్ కు సాధ్యం కాదంటూ?

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) అని ప్రకటించగానే నెటిజన్లలో చాలామంది మ్యాజిక్ అనేది ఒక్కసారే జరుగుతుందని ఆ మ్యాజిక్ రిపీట్ కావడం కష్టమని కామెంట్లు చేశారు.అయితే టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

 Netizens Praises Anupama Guts Details Here Goes Viral In Social Media-TeluguStop.com

హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ ను పరిశీలిస్తే అన్ని థియేటర్లలో బుకింగ్స్ లో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) తనకు అలవాటైన పాత్రను సునాయాసంగా చేశారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు.

Telugu Netizenspraises, Tillu Square-Movie

అనుపమ కనిపించిన ప్రతి సీన్ లో తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు.వాస్తవానికి అనుపమ( Anupama Parameswaran ) ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదు.ఇంటర్వల్, క్లైమాక్స్ లో ఆ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్టులు మాత్రం అదిరిపోయాయి.

టిల్లు స్క్వేర్ రిలీజ్ కు ముందు అనుపమ బోల్డ్ సీన్స్( Bold Scenes ) గురించి ప్రచారం జరిగినా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆమె యాక్టింగ్ గురించి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అనుపమ అద్భుతంగా పలికించారు.

అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలో మళ్లీమళ్లీ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

Telugu Netizenspraises, Tillu Square-Movie

అనుపమ కెరీర్ లో లిల్లీ పాత్ర( Lilly Role ) మాత్రం స్పెషల్ రోల్ గా నిలిచిపోతుంది.ఈ పాత్రను కొంతమంది టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి.ఇలాంటి పాత్రల్లో అవకాశాలు అరుదుగా వస్తాయని చెప్పవచ్చు.

టిల్లు స్క్వేర్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని నాగవంశీ( Producer Naga Vamsi ) నమ్మకం వ్యక్తం చేయగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.అనుపమకు భవిష్యత్తులో ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube