Anupama Parameswaran : ఇలాంటి పాత్ర చేయాలంటే అనుపమలా గట్స్ ఉండాలి.. ఏ హీరోయిన్ కు సాధ్యం కాదంటూ?

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) అని ప్రకటించగానే నెటిజన్లలో చాలామంది మ్యాజిక్ అనేది ఒక్కసారే జరుగుతుందని ఆ మ్యాజిక్ రిపీట్ కావడం కష్టమని కామెంట్లు చేశారు.

అయితే టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ ను పరిశీలిస్తే అన్ని థియేటర్లలో బుకింగ్స్ లో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) తనకు అలవాటైన పాత్రను సునాయాసంగా చేశారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. """/"/ అనుపమ కనిపించిన ప్రతి సీన్ లో తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు.

వాస్తవానికి అనుపమ( Anupama Parameswaran ) ఇలాంటి పాత్రలు గతంలో ఎప్పుడూ చేయలేదు.

ఇంటర్వల్, క్లైమాక్స్ లో ఆ పాత్రకు సంబంధించి వచ్చే ట్విస్టులు మాత్రం అదిరిపోయాయి.

టిల్లు స్క్వేర్ రిలీజ్ కు ముందు అనుపమ బోల్డ్ సీన్స్( Bold Scenes ) గురించి ప్రచారం జరిగినా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆమె యాక్టింగ్ గురించి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అనుపమ అద్భుతంగా పలికించారు.అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలో మళ్లీమళ్లీ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

"""/"/ అనుపమ కెరీర్ లో లిల్లీ పాత్ర( Lilly Role ) మాత్రం స్పెషల్ రోల్ గా నిలిచిపోతుంది.

ఈ పాత్రను కొంతమంది టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి.ఇలాంటి పాత్రల్లో అవకాశాలు అరుదుగా వస్తాయని చెప్పవచ్చు.

టిల్లు స్క్వేర్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని నాగవంశీ( Producer Naga Vamsi ) నమ్మకం వ్యక్తం చేయగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

అనుపమకు భవిష్యత్తులో ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో నటించనున్న యంగ్ హీరో…