రూ.100 చొక్కాకు ఇలా బేరం చేయండి సర్.. జపాన్ అంబాసిడర్‌కు సోషల్ మీడియాలో సూచనలు

షాపింగ్‌కు( Shopping ) వెళ్లినప్పుడు చాలామంది బేరం ( Bargain ) ఆడుతూ ఉంటారు.ఒక షాపులో బేరం కుదరకపోతే వేరే షాపుకు వెళతారు.

 Netizens Asks Japanese Ambassador Hiroshi Suzuki To Bargain 100rs Shirt Details,-TeluguStop.com

ఇలా ఒక వస్తువు కొనాలంటే చాలా షాపులు తిరుగుతారు.ఎక్కడ బేరం కుదిరితే, ఎక్కడ తక్కువకు వస్తుందని అనిపిస్తే అక్కడ కొనుగోలు చేస్తారు.

కొంతమంది తక్కువకు ఇచ్చేంత వరకు బేరం ఆడుతూనే ఉంటారు.చివరికి ఇచ్చేంతవరకు వదిలిపెట్టరు.

కొంతమందికి బేరం ఆడటం బాగా వచ్చి ఉంటుంది.మరికొంతమందికి బేరం ఆడటం రాదు.

దీంతో షాపు వాడు ఎంత చెబితే అంతకు తీసుకుని వెళతారు.

Telugu Bargain, Tips, Hiroshi Suzuki, Mumbai, Rs-Latest News - Telugu

బేరం ఆడటం తెలియనివాళ్లు పక్కన బాగా తెలిసినవారిని షాపింగ్‌కు తీసుకెళుతూ ఉంటారు.అయితే తాజాగా జపాన్ అంబాసిడర్ హిరోషి జుజుకీ( Hiroshi Suzuki ) బేరం ఆడిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.హిరోషి జుజుకీ ముంబైలోని ఓ లోకల్ మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లారు.ఈ సందర్బంగా షాపులో రూ.100 ఫిక్స్‌డ్ రేట్ అని రాసి ఉన్న షర్ట్ ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీనికి ఎంత బేరం ఆడాలంటూ నెటిజన్లను కోరాడు.దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Bargain, Tips, Hiroshi Suzuki, Mumbai, Rs-Latest News - Telugu

పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు జపాప్ అంబాసిడర్ సుజుకికి సలహాలు ఇస్తున్నారు.కొంతమంది రూ.80 అని, మరికొందరు రూ.50లకు అంటూ సలహాలు ఇస్తున్నారు.ఇక మరొక నెటిజన్ అయితే పుణెకు రావాలని, ఇక్కడ రూ.100కు నాలుగు షర్ట్‌లు వస్తాయంటూ సూచించాడు.సుజుకి పోస్ట్‌ను సుమారు 54వేల మందికిపైగా చూశారు.ఇలా నెటిజన్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.అయితే ఈ షాపింగ్ చేయడానికి ముందు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో సుజుకికి భేటీ అయ్యారు.దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అందుకుందు ముంబై మెట్రో గేట్ వద్ద నిలబడి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube