ఆ విషయంలో విరాట్ కోహ్లీపై నెటిజెన్స్ భారీ ట్రోలింగ్..!

ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప‌దే ప‌దే వార్త‌ల్లో నిలుస్తున్నాడు.కెప్టెన్సీ నుంచి ఆయ‌న త‌ప్పుకున్న వివాదంపై ఒకవైపు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే.

 Netizens Are Trolling Virat Kohli In That Regard  , Virat Kohli, Gum, Eating,tro-TeluguStop.com

ఇప్పుడు కోహ్లీ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు.దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ చివరి వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ చివరి వన్డేలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ద‌క్షిణాఫ్రికా, భార‌త్ జట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు.అయితే, ఆ సమ‌యంలో భారత ఆటగాళ్లు జాతీయ గీతం ఆల‌పిస్తుండ‌గా కోహ్లీ మాత్రం చూయింగ్‌ గమ్‌ నములుతూ గీతాలాపన చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

జాతీయ గీతం ఆలపిస్తున్న స‌మ‌యంలో కోహ్లీ ప్ర‌వ‌ర్తించిన తీరు బాగోలేద‌ని, చాలా పొగ‌రుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఆయ‌న‌ జాతీయ గీతాన్ని అవమానించాడని.దీనికి కోహ్లీ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంటున్నారు.

ఎప్పుడూ ఫీల్డ్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ.ఇప్పుడు ఎందుకు ఇలా ఇంట్రెస్టు లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని మ‌రి కొంత మంది సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

కాగా, కోహ్లీ ఇగోను ప‌క్క‌న‌పెట్టాలంటూ ఇటీవ‌లే క‌పిల్ దేవ్‌ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సూచించిన విష‌యం తెలిసిందే.జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో కోహ్లీ తీరు ఆయ‌న‌ను మ‌రోసారి చిక్కుల్లో ప‌డేసింది.కాగా, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా పూర్తిగా విఫ‌లం కావ‌డం ప‌ట్ల కూడా నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.ఆట‌పై దృష్టి పెట్టాల‌ని క్రికెట‌ర్ల‌కు సూచిస్తున్నారు.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఇటీవ‌ల విరాట్ కోహ్లి, బీసీసీఐ మ‌ధ్య వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.

కెప్టెన్సీ విష‌యంలో ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది.అప్ప‌టి నుంచి విరాట్ కోహ్లి ప్ర‌వ‌ర్త‌నలో మార్పు క‌నిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Netizens Are Trolling Virat Kohli In That Regard , Virat Kohli, Gum, Eating,trollss , National Anthem , Bcci , Kapil Dev , Viral Vedio , Chewing Gum - Telugu Bcci, Gum, Kapil Dev, National Anthem, Trollss, Vedio, Virat Kohli #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube