బిడ్డను వదిలి వెళ్లలేక భారంగా వెళ్తున్న జవాన్‌.. సెల్యూట్‌ చేస్తున్న నెటిజన్లు!

బిడ్డల పట్ల తల్లి ఎంత ప్రేమను కలిగి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.తల్లి ప్రేమను మించినది లేదు ఈ ప్రపంచంలో.

 Netizens Are Saluting The Heavy Jawan Who Is Unable To Leave The Child, Mothers-TeluguStop.com

ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తల్లి తన బిడ్డలను విడిచి పెట్టి ఉండదు.అయితే దేశ రక్షణలో భాగంగా తన కర్తవ్య నిర్వహణ కోసం ఓ తల్లి తన 10 నెలల పసికందును విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ క్రమంలో తన బిడ్డను భర్త, కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ కన్నీరు మున్నీరు అయింది.ముద్దులొలికే తన చిన్నారిని విడిచి వెళ్లలేక బరువెక్కిన హృదయవేదనతో వెక్కివెక్కి ఏడుస్తూ విధులకు బయలు దేరింది.

కాగా దీనికి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని కొల్హాపూర్ ( Kolhapur in Maharashtra )జిల్లా కర్వీర్ తాలూకా నంద్‌గావ్‌కు చెందిన వర్షా రాణి ( Varsha Rani )బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్‌గా పని చేస్తోంది.పది నెలల కిందటే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.పది నెలల సెలవు కాలంలో బిడ్డ ఆలనా పాలనలో గడిచిపోయాయి.

అనంతరం మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయం రావడంతో విధులకు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.అందుకే తన బిడ్డను వదిలి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధమైంది.

ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌( Railway station )కు బయలుదేరింది.డ్యూటీకి వెళ్లాలనే కోరిక ఏ మాత్రం లేకపోయినప్పటికీ బలవంతంగా రైలు ఎక్కింది.

ఈ క్రమంలోనే తన బిడ్డను విడిచి పెడుతూ భావోద్వేగం ఆపులేక బోరున ఏడ్చేసింది.బిడ్డను వదల్లేక కన్నీళ్లు మున్నీరైంది.భర్తను, తల్లిదండ్రులను కౌగలించుకుని ఏడ్చేసింది.రైలు కదులుతున్నా ఆమె డోర్ దగ్గరే నిల్చుని బిడ్డను చూస్తూ కన్నీటితో వీడ్కోలు పలికింది.కాగా, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.

ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube