లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జూన్ 9న నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.ఇక వీరి పెళ్లి ముందుగా ఆగస్టులో ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటికీ అది జరగలేదు.
కానీ మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ నెలలో వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తోంది.అయితే పెళ్లికి ఇంకా కొద్దిరోజులే ఉన్న సమయంలో లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ (Varun Tej) ని పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు పెడుతున్నారు.
మరి దీనికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవ దారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమా భారీ డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాకి కనీసం పోస్టర్ ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు అంటూ ఇప్పటికే నెట్టింట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.అలాగే వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఇదేనని అందరూ వార్తలు వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ట్రోలర్స్ కావాలనే లావణ్య త్రిపాటి మీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టడం వల్లే మీకు ఈ సినిమాలన్నీ ప్లాఫ్ అవుతున్నాయని, అంతేకాకుండా చిరంజీవి భోళా శంకర్ (Bhola shankar) సినిమా కూడా అందుకే ప్లాఫ్ అయిందని, ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.అలాంటిది ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఇంకా ఎన్ని పనులు జరుగుతాయో ఒకసారి ఆలోచించండి.అందుకే ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అంటూ కొంతమంది కావాలనే ఈ నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు.

కానీ వైరల్ అవుతున్న ఈ వార్తలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు మెగా అభిమానులు.సినిమా బాలేక పోతే లావణ్య త్రిపాటి పై భారం వేయడం ఏమాత్రం బాగాలేదు.అది దర్శకుడు చేతిలో ఉంటుంది.
డైరెక్టర్ చేసిన పొరపాటుకి లావణ్య త్రిపాఠిని ఎందుకు నిందించడం అంటూ కౌంటర్ ఇస్తున్నారు.అంతేకాదు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ (Varn tej) ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుండి రిలేషన్ లో ఉన్నారు.
మరి అప్పటినుండి లేనివి ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు ఈ మధ్యనే క్లీంకారా (Klinkaara) కూడా పుట్టింది.అలాగే ఆమె అదృష్టవంతురాలు అని జ్యోతిష్యుడు చెప్పారు.కానీ క్లింకారా పుట్టాక ఈ సినిమాలు ప్లాఫ్ అయ్యాయి.
అలాగని క్లింకారా వల్లే వీరికి దురదృష్టం పట్టింది అనుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.