Ariyana Glory : అరియానాకు నెటిజన్ షాక్.. అలా ఎందుకు చేస్తున్నావ్ అవసరమా అంటూ?

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా( Ariyana Glory ) అంటే ఎవరైనా ఇట్టాగే గుర్తుపడతారు.ఎందుకంటే హౌస్ లో ఉన్నంతకాలం ఈమె చేసిన రచ్చ అందరికీ తెలిసిందే కాబట్టి.

 Netizen Shocked Ariana Why Are You Doing That Is It Necessary-TeluguStop.com

ఇక ఈ షోతోనే క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.అంతేకాకుండా నాన్ స్టాప్ బిగ్బాస్( Non Stop Bigg Boss ) లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

తన కెరీర్ ను మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.అయితే ఓ సారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma )ను ఇంటర్వ్యూ చేయగా.

ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

దాంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.అవి కూడా చాలా వరకు క్లిక్ మనిపించాయి.

ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇక తనకు అషు రెడ్డి( Ashu Reddy ) తో మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంకా కాదు.

ఇక సోషల్ మీడియాలో కూడా అరియానా బాగా రచ్చ చేయడం మొదలు పెట్టింది.ఈ మధ్య పొట్టి బట్టలు బాగా రెచ్చిపోతుంది.

ఎప్పుడైతే అషు తో పరిచయం బాగా పెరిగిందో అప్పటినుంచి ఆమె లాగా తయారవుతుంది.

నిజానికి మొదట్లో అరియానా ఎప్పుడు కూడా గ్లామర్ షో చేసినట్లు అనిపించలేదు.కానీ ఈ మధ్య మాత్రం బాగా బరితెగించేసింది.దీంతో ఆమెపై ట్రోల్ చేయటం కూడా మొదలుపెట్టారు.

అంతేకాకుండా తన మీద ఉన్న గౌరవాన్ని పోయేటట్లు చేసుకొని అభిమానుల సంఖ్య కూడా తగ్గించుకుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకోగా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అందులో తను బాగా గ్లామర్ షో చేయగా నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.అయితే ఓ అభిమాని మాత్రం ఒక పెద్ద షాక్ ఇచ్చింది.అక్క ఎందుకు అన్ని పోస్ట్ చేస్తున్నావ్.ప్రతిదీ అవసరం లేదు అక్క.అర్థం చేసుకో.సోషల్ మీడియాలో కొన్ని ప్రైవసీ పెట్టుకో.

అన్ని ప్రతిసారి ఎందుకు పంచుకుంటున్నావు.అందరు చూడు ఎన్ని ఫొటోస్ దిగిన.

ఏం పోస్ట్ చేయరు.ప్రతిదీ చెయ్యకు అక్క అర్థం చేసుకో.

అక్క అందరూ ప్రొఫెషనల్ గా ఉంటున్నారు.నువ్వు తప్ప.

కొద్దిగా మైంటైన్ చెయ్యు.కానీ పోస్టు ఎందుకు చేస్తున్నావ్.

అవసరం లేదు.జస్ట్ స్టోరీ పెట్టు చాలు.

అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.ఇక అరియానా ప్రస్తుతం బిబి జోడీలో డాన్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube