Madhuri Dixit : నెట్ ఫ్లిక్స్ కు లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరోయిన్.. అవమానం జరిగిందంటూ?

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్( Madhuri Dixit ) గురించి ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్లలో మాధురి దీక్షిత్ కూడా ఒకరు.

 Netflix Gets Legal Notice Over Remarks On Actress Madhuri Dixit In The Big Bang-TeluguStop.com

వయసు పెరుగుతున్న కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.అంతేకాకుండా యువతని తన అందంతో కట్టిపడేస్తూ ఉంటుంది మాధురి దీక్షిత్.

ప్రస్తుతం ఈమె బాలీవుడ్( Bollywood ) లీ పలు టెలివిజన్ డ్యాన్స్​ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అలాగే అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తోంది మాధురి దీక్షిత్.

ఇది ఇలా ఉంటే తాజాగా మాధురి దీక్షిత్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ప్రముఖ.ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ ( Netflix )అవమానించిందట.నెట్​ఫ్లిక్స్​లో టెలికాస్ట్ అవుతున్న అమెరికన్ సిట్​కామ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ లోని ఒక ఎపిసోడ్​ పై ప్రస్తుతం దుమారం రేగుతోంది.

ది బిగ్ బ్యాంగ్ థియరీ లోని ఒక ఎపిసోడ్​లో మాధురీ దీక్షిత్​ ను సూచించేందుకు ఒక అవమానకరమైన పదాన్ని వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్( Mithun Vijay Kumar) అంటున్నారు.ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​ పై ఆయన దావా కూడా వేశారు.

ది బిగ్ బ్యాంగ్ థియరీ సీజన్ 2కు సంబంధించిన ఎపిసోడ్​ను తొలగించాలని లీగల్ నోటీసులో మిథున్ విజయ్ కుమార్ తెలిపారు.

ది బిగ్ బ్యాంగ్ థియరీ ( The Big Bang Theory )రెండో సీజన్​లో షెల్డన్ కూపర్ పాత్రధారి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్​ను మాధురీ దీక్షిత్​ తో పోలుస్తాడు.ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి మాధురీ దీక్షిత్ అని పేర్కొంటాడు.దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్​ను పోషించిన కునాల్ నయ్యర్.

కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్​తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత అని బదులిస్తాడు.అయితే, ఈ కామెంట్స్ మాధురీ దీక్షిత్​ను అగౌరవపరిచే విధంగా, ఆమెను అవమానపరిచేలా, పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని మిథున్ విజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

వెంటనే అందుకు సంబంధించిన ఎపిసోడ్​ ని తొలగించాలని లేదా మహిళల పై వివక్షతను ప్రోత్సహించినందుకు గానూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ్ పేర్కొన్నారు.మరి ఈ వివాదం పై మాధురి దీక్షిత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.అలాగే విజయ్ తెలిపిన మేరకు ఆ ఎపిసోడ్ ని డిలీట్ చేస్తారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube