నేపాల్ విమాన ప్రమాద దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్ లో.. వైరల్ వీడియో?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అందులో ఉండే సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది.అంతేకాకుండా లైవ్ వీడియోలంటూ లైవ్ లో జరిగే సంఘటనలు కూడా వెంటనే తెలిసిపోతున్నాయి.

 Nepal Plane Crash Scenes On Facebook Live Viral Video, Nepal Plane Crash, Scenes-TeluguStop.com

అయితే కొన్ని కొన్ని సార్లు లైవ్ లో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఇక అటువంటి సంఘటనలు లైవ్ ద్వారా బయటపడటం వల్ల అవి వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా నేపాల్ విమాన ప్రమాదం దృశ్యాలకు సంబంధించిన లైవ్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

నేపాల్ లో యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ 72 అనే విమానం ఆదివారం కుప్పకూలిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

  రాజధాని కాట్ మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన 20 నిమిషాలకే ఈ విమానం అకస్మాత్తుగా కుప్ప కూలింది.మరో అయిదు నిమిషాల్లో గమ్యం చేరుకునే సమయంలో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది.

ఇక ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం 72 ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందులు ఉన్నారు.ఇక ముఖ్యంగా ఇందులో ఐదుగురు భారతీయులతో సహా పదిమంది విదేశీయులు కూడా ఉన్నారు.

అయితే భారతీయులలో ఒకరైన సోను జైస్వాల్ ఫోన్ నుండి బయటపడిన లైవ్ స్ట్రీమింగ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.సోను జైస్వాల్ కిటికీ పక్కన కూర్చుని ఉండగా పై నుండి సిటీ అందాలను చూపించడానికి ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.

అలా అక్కడున్న అందాలను వీడియో ద్వారా చూపించాడు.అలా కాసేపు అతడు లైవ్ లోనే ఉండగానే అదే సమయంలో విమానం కదులుతున్నట్లు కనిపించడంతో అందరూ అరవడం మొదలుపెట్టారు.దీంతో విమానం కుప్పకూలగా.  ఆ సమయంలో వచ్చిన భారీ శబ్దాలతో పాటు మంటలు కూడా కనిపించాయి.దీంతో ప్రయాణికులంతా కూడా ఒకేసారి అరవటం మొదలుపెట్టారు.ఇక ఈ ఘటన మొత్తం లైవ్ స్ట్రీమింగ్ లో రికార్డు కాగా పలువురు అధికారులు ఆ ఫోన్ స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవ్వగా ఈ ఘటనను లైవ్ లో చూసి అందరూ చలించి పోయారు.మొత్తం 72 మంది ప్రయాణికులలో ఇప్పటికీ 68 మృతదేహాలను బయటకు తీశారు.ఇక ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ తెలుపగా ఈ ఘోరమైన ప్రమాదానికి దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు.ఇక మృతదేహాల కుటుంబ సభ్యులు ఈ ఘటనను తలుచుకొని కన్నీరు మున్నిరవుతున్నారు.

ఇక పలువురు అధికారులు ఈ ఘటనకు కారణం తెలుసుకోవడానికి పలు విచారణలు చేపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube