ఏపీలో రాజకీయ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి.ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ఉన్నాయి.
ఇదే సమయంలో అధికారాన్ని చేజారి పోకుండా వైసీపీ( YCP ) కూడా శ్రమిస్తుంది.ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్( CM Jagan ) నేతలు నిత్యం ప్రజలలో ఉండే రీతిలో పార్టీ తరఫున కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఎప్పటికప్పుడు నేతల పనితీరు గురించి సర్వేలు కూడా చేపిస్తూ వాటి ఆధారంగా వచ్చే ఎన్నికలలో టికెట్లు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది రకరకాల పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీలో ఉన్న నేతలు మరొక పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.విషయంలోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత ఆనం జయకుమార్ రెడ్డి( Anam Jayakumar Reddy ) వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి ఆనంను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.