నెల రోజులకే కిర్రాక్ ఆర్పీ రెస్టారెంట్ క్లోజ్.. ఆ ఒక్క తప్పే కారణమా?

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ ఆ తర్వాత పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో గురించి, ఆ షో నిర్వాహకుల గురించి ఆర్పీ చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు.

 Nellore Kirrak Rp Restaurent Closed Details, Nellore Peddareddy Chepala Pulusu,-TeluguStop.com

ఆ తర్వాత ఇతర కామెడీ షోలలో కూడా ఆర్పీకి అవకాశాలు రాలేదు.ప్రస్తుతం సారంగపాణి అనే వెబ్ సిరీస్ లో మాత్రమే ఆర్పీ కనిపిస్తున్నారు.

అయితే నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ద్వారా కిర్రాక్ ఆర్పీ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లు ఈ రెస్టారెంట్ కు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఈ రెస్టారెంట్ పాలిట వరమైంది.

అయితే తక్కువ స్థలంలో రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ రెస్టారెంట్ నిర్వహణ విషయంలో ఆర్పీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ రెస్టారెంట్ తాత్కాలికంగా క్లోజ్ అయిందని సమాచారం అందుతోంది.

మరిన్ని మార్పులతో త్వరలో రెస్టారెంట్ ను మళ్లీ ఓపెన్ చేయాలని ఆర్పీ భావిస్తున్నారని సమాచారం.

కిచెన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు షాప్ కు కీలక మార్పులు చేసి మళ్లీ రెస్టారెంట్ ను ఓపెన్ చేయాలని భావిస్తున్నానని ఆర్పీ చెప్పుకొచ్చారు.వర్కర్లు, మాస్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆర్పీ కామెంట్లు చేశారు.అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందని తాత్కాలికంగా రెస్టారెంట్ ను ఆపామని ఆర్పీ అన్నారు.

నెల్లూరు మహిళలతో చేపల పులుసు వండించాలని ప్లాన్ చేశామని ఆయన పేర్కొన్నారు.

అడిషన్స్ పెట్టి చేపల పులుసు టేస్ట్ చేసి ఎంపిక చేస్తామని ఆర్పీ అన్నారు.హైదరాబాద్ కు వచ్చే ఆలోచన ఉంటే వాళ్లకు అవకాశం కల్పిస్తామని ఆయన కామెంట్లు చేశారు.ఏ స్థాయిలో జనాలు వస్తారో ముందే అంచనా వేయకపోవడం వల్లే తాత్కాలికంగా రెస్టారెంట్ క్లోజ్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube