నెల రోజులకే కిర్రాక్ ఆర్పీ రెస్టారెంట్ క్లోజ్.. ఆ ఒక్క తప్పే కారణమా?

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ ఆ తర్వాత పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్ షో గురించి, ఆ షో నిర్వాహకుల గురించి ఆర్పీ చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు.

ఆ తర్వాత ఇతర కామెడీ షోలలో కూడా ఆర్పీకి అవకాశాలు రాలేదు.ప్రస్తుతం సారంగపాణి అనే వెబ్ సిరీస్ లో మాత్రమే ఆర్పీ కనిపిస్తున్నారు.

అయితే నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ద్వారా కిర్రాక్ ఆర్పీ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు.

ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లు ఈ రెస్టారెంట్ కు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఈ రెస్టారెంట్ పాలిట వరమైంది.

అయితే తక్కువ స్థలంలో రెస్టారెంట్ ను ఓపెన్ చేయడం కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ రెస్టారెంట్ నిర్వహణ విషయంలో ఆర్పీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

అయితే ఈ రెస్టారెంట్ తాత్కాలికంగా క్లోజ్ అయిందని సమాచారం అందుతోంది.మరిన్ని మార్పులతో త్వరలో రెస్టారెంట్ ను మళ్లీ ఓపెన్ చేయాలని ఆర్పీ భావిస్తున్నారని సమాచారం.

"""/"/ కిచెన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు షాప్ కు కీలక మార్పులు చేసి మళ్లీ రెస్టారెంట్ ను ఓపెన్ చేయాలని భావిస్తున్నానని ఆర్పీ చెప్పుకొచ్చారు.

వర్కర్లు, మాస్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆర్పీ కామెంట్లు చేశారు.

అప్ డేట్ కావాల్సిన అవసరం ఉందని తాత్కాలికంగా రెస్టారెంట్ ను ఆపామని ఆర్పీ అన్నారు.

నెల్లూరు మహిళలతో చేపల పులుసు వండించాలని ప్లాన్ చేశామని ఆయన పేర్కొన్నారు. """/"/ అడిషన్స్ పెట్టి చేపల పులుసు టేస్ట్ చేసి ఎంపిక చేస్తామని ఆర్పీ అన్నారు.

హైదరాబాద్ కు వచ్చే ఆలోచన ఉంటే వాళ్లకు అవకాశం కల్పిస్తామని ఆయన కామెంట్లు చేశారు.

ఏ స్థాయిలో జనాలు వస్తారో ముందే అంచనా వేయకపోవడం వల్లే తాత్కాలికంగా రెస్టారెంట్ క్లోజ్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.