Krushna Chandra Ataka : 13 సంవత్సరాలు కూలిపని.. 33 ఏళ్ల వయస్సులో నీట్ ర్యాంక్.. ఈ వ్యక్తి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని కెరీర్ పరంగా ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలలు కంటూ ఉంటారు.అయితే ఎక్కువమంది లక్ష్యాలను సాధించుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమవుతాయి.

 Neet Ranker Krushna Chandra Ataka Inspirational Success Story Details-TeluguStop.com

తినడానికి సరైన తిండి కూడా లేక ఆర్థిక ఇబ్బందులను ఎన్నో కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి.అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొంతమంది మాత్రం ఎంతో కష్టపడి తమ కలలను, లక్ష్యాలను సాధిస్తున్నారు.

అలా నీట్ ర్యాంక్( NEET Rank ) సాధించాలనే కలను నెరవేర్చుకున్న వ్యక్తులలో కృష్ణచంద్ర( Krushna Chandra ) ఒకరు.13 సంవత్సరాల పాటు కూలి పనులు చేస్తూనే కష్టపడిన కృష్ణచంద్ర తన ప్రతిభతో ప్రశంసలు అందుకున్నారు.గిరిజన విద్యార్థి అయిన కృష్ణచంద్ర నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ప్రస్తుతం ఒడిశాలోని( Odisha ) ప్రముఖ కాలేజ్ లో విద్యను అభ్యసిస్తున్నారు.పని చేస్తూ చదువుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

అయితే చదువుకుంటే తన భవిష్యత్తు మారిపోతుందని బలంగా నమ్మిన కృష్ణచంద్ర ఇటుక బట్టీలో, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో కూడా పని చేశారు.రోజుకూలీగా కృష్ణచంద్ర 100 రూపాయలు తీసుకున్న రోజులు సైతం ఉన్నాయి.ఒడిశా ప్రభుత్వం కృష్ణచంద్ర చదువు కోసం ఆర్థిక సహాయం అందిస్తుండటం గమనార్హం.కృష్ణచంద్ర సక్సెస్ స్టోరీ( Krushna Chandra Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కృష్ణచంద్ర ఒక్కో మెట్టు పైకి ఎదిగి భవిష్యత్తులో డాక్టర్ గా వైద్య సేవలను అందించి ప్రశంసలు అందుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిభను నమ్ముకుని కష్టపడితే ఆలస్యంగానైనా విజయాలు దక్కుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.భవిష్యత్తులో వైద్యుడిగా పేదలకు సేవలు అందిస్తానని కృష్ణచంద్ర చెబుతున్నారు.పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని కృష్ణచంద్ర కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

రెండో ప్రయత్నంలో నీట్ పరీక్షలో కృష్ణచంద్ర అటక అర్హత సాధించడం గమనార్హం.గామస్థులు, తోటి స్నేహితుల సహాయం వల్లే కెరీర్ పరంగా లక్ష్యాన్ని సులువుగా సాధించడం సాధ్యమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube