స్కూబా డైవింగ్ చేస్తూ కూడా అదే ఆలోచన చేస్తున్న నీరజ్ చోప్రా..!

నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి భారత దేశానికి గర్వకారణంగా నిలిచారు.

 Neeraj Chopra Javelin Throwing Under Water In Scuba Dive, Neeraj Chopra, Sports-TeluguStop.com

ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలంటే ఆషామాషీ విషయం కాదు.అసాధారణమైన ప్రతిభతో పాటు పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది.

అయితే నీరజ్ చోప్రా అతి చిన్న వయసులోనే జావెలిన్ త్రో ఆటలో అద్భుతమైన ప్రదర్శనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశవ్యాప్తంగా మంచి ఖ్యాతి గడించారు.

ఇప్పుడు వచ్చిన పేరు, బంగారం పతకం వెనుక అతని కృషి ఎంతో ఉంది.ఉదయం లేచిన సమయం నుంచి పడుకునేంత వరకు అతను జావెలిన్ ఆట గురించే ఆలోచిస్తారంటే.

అతని అంకితభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నీరజ్ మాల్దీవుల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

సాధారణంగా హాలిడేకి వెళ్ళినవారు పర్సనల్, కెరీర్ లైఫ్ గురించి పూర్తిగా మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు.కానీ నీరజ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన ప్రత్యేకత ఏంటో చాటుకుంటున్నారు.

తాజాగా అతను మాల్దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తూ జావెలిన్ త్రో విసిరి ఆశ్చర్యపరిచారు.దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.అక్కడ కూడా.

అదీ నీటిలోనూ నీరజ్ జావెలిన్ ఆటే ప్రాక్టీస్ చేస్తుండడం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.జావెలిన్ ఆట పట్ల నీరజ్ కి ఉన్న మక్కువ చూసి ముచ్చట పడుతున్నారు.

ఈ స్థాయిలో ఆట పట్ల మక్కువ ఉంది కాబట్టే నీరజ్ పతకం సాధించగలిగారేమో అని కామెంట్లు పెడుతున్నారు.

“అస్మాన్ పార్, జమీన్ పే, యా నీటి అడుగున ఉన్నా.నేను ఎప్పుడూ జావెలిన్ గురించే ఆలోచిస్తాను.శిక్షణ షురూ హో గై” అంటూ నీరజ్ ఈ వీడియో పోస్టుకి క్యాప్షన్ జోడించారు.

కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.నిజానికి బంగారు పతకం ముద్దాడిన సమయం నుంచి మొన్నటివరకు నీరజ్ ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి, కేంద్ర మంత్రులు, సినీ సెలబ్రెటీలు ఇలా చాలామందిని కలిశారు.

అలాగే చాలా సన్మాన కార్యక్రమాలతో ఊపిరి కూడా తీసుకోలేనంతగా బిజీ అయిపోయారు.అయితే ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో కాసేపు సేదతీరడానికి మాల్దీవులకి వెళ్లారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube