ఆస్ట్రేలియా కార్చిచ్చు... 48 కోట్ల మూగజీవాలు అగ్నికి ఆహుతి

ఓ వైపు గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో భూమి అగ్నిగోళంలా తయారవుతుంది.పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా మానవ మనుగడ ప్రస్నార్ధకంగా మారుతుంది.

మరో వైపు ప్రపంచీకరణలో అడవులని విధ్వంసంతో వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి.ఇక వేడెక్కుతున్న వాతావరణంతో అడవులలో కూడా ఊహించని అగ్ని ప్రమాదాలు సంభవించి వృక్ష సంపదని కాల్చి బూడిద చేస్తున్నాయి.

ఇదంతా ఓ విధంగా మానవ వినాశనం వైపు దారి తీస్తున్న పరిస్థితులే కారణం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.అడవులని, మనతో పాటు ఈ భూమిపై ఉన్న జీవజాలాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, క్వీన్ లాండ్ అడవులలో రేగిన కార్చిచ్చు వారాల పాటు కొనసాగింది.దీనిని ఆర్పేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

ఇక ఈ కార్చిచ్చు కారణంగా అడవుల మీద ఆధారపడి జీవించే మూగ జీవాలు సుమారు 48 కోట్ల వరకు మృత్యువాత పడ్డాయని తెలుస్తుంది.దావానంలో వ్యాపించిన ఈ కార్చిచ్చు కారణంగా క్షీరదాలు, అడవులలో నివసించే జంతువులు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు మృతిచెందినట్లు తెలుస్తుంది.

ఓ విధంగా చెప్పాలంటే దశాబ్దంలో ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు