తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నయనతార ప్రస్తుతం కోలివుడ్లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోని నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కనెక్ట్.అశ్విన్ శరవనన్ దక్షకత్వం వహించిన ఈ సినిమా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార ఒక లేఖను విడుదల చేసింది.ఆ లేఖ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.ఈ ఏడాది నాకెన్నో ఆనందాలను అందించింది.
కృతజ్ఞతా భావంతో ఇది నిండింది.మా కనెక్ట్ సినిమాని వీక్షిస్తూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తోన్న సినీ ప్రియులకు ధన్యవాదాలు.
హారర్ జోనర్‌లో దీన్ని మరింత విభిన్నంగా తీర్చిదిద్దేందుకు మేము ఎంతగానో శ్రమించాము.సినిమా విషయంలో నన్ను నమ్మి, ప్రతి క్షణం నాకు అండగా ఉన్న దర్శకుడు అశ్విన్‌కు ధన్యవాదాలు.
ఆయన సినిమాలు తెరకెక్కించే విధానం అద్భుతంగా ఉంటుంది.

ఆయనతో మరెన్నో చిత్రాలు చేయాలని ఉంది.ఇక, నిర్మాత విఘ్నేశ్ శివన్, రౌడీ పిక్చర్స్ బృందానికి ధన్యవాదాలు అని తెలిపారు.అనంతరం సినీ ప్రియుల్ని ఉద్దేశిస్తూ.
మీరు ప్రేమ, అభిప్రాయం, విమర్శలనూ మేము అంగీకరిస్తున్నాము.భవిష్యత్తులో తెరకెక్కించే చిత్రాలకు వీటిని అనుభవ పాఠాలుగా భావిస్తున్నాము అని ఆ లేఖలో రాసుకొచ్చింది నయనతార.
ఇకపోతే నయనతార విషయానికి వస్తే ఇటీవలే ఈమె కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల ఈ దంపతులు సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.







