నయనతార సరోగసి విచారణ పూర్తి.. నివేదికలో ఏం ఉందంటే?

కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇటీవల ఈ జంట కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యాము అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 Nayanathara Surrogacy Issue Committee Report Ready , Nayanatara, Surrogacy Issue-TeluguStop.com

అయితే పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడం అందులో సరోగసి ద్వారా జన్మనివ్వడం అన్నది పెద్ద వివాదంగా మారింది.దీంతో ఎక్కడ చూసినా కూడా ఎందుకు సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి.

అంతేకాకుండా చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ పెళ్లయిన నాలుగు నెలలకి ఎలా కవల పిల్లలు జన్మించారు అని ప్రశ్నిస్తుండగా.

మరికొందరు పెళ్ళికి ముందే నయనతార గర్భవతి అయ్యిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ అది నిజం అయితే ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార కనిపించింది కదా అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రశ్నలపై ఇటీవలే నయనతార స్పందిస్తూ ఆ విషయాలకు పూర్తి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సర్వసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు నోటీసులు కూడా జారీ చేసింది.అంతే కాకుండా ఇదే విషయంపై కమిటీ సభ్యులు పూర్తి విచారణను కూడా పూర్తి చేశారు.

Telugu Kollywood, Nayanatara, Surrogacy, Vignesh Shivan-Movie

ఇక నేడు అనగా బుధవారం ప్రభుత్వానికి ఈ నివేదికను అందజేయనున్నారు.ఈ నేపథ్యంలోనే నయనతార దంపతులకు కమిటి అఫిడవిట్ పంపింది.కాగా ఆ దంపతులు అందులో వాళ్లకు ఆరేళ్లకేతమే రిజిస్టర్ మ్యారేజ్ అయింది అని అందులో తెలిపారు.అంతే కాకుండా గత ఏడాది డిసెంబర్లో సరోగసి కోసం అప్లై కూడా చేసినట్టు తెలిపారు.

చట్టాన్ని అధిక్రమించలేదని నిబంధనలు పాటించాము అని ఆ జంట అందులో పేర్కొన్నారు.మరి ఈ వివాదం పై నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత నివేదికలో ఏం చెబుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరి ఈ వివాదం నుంచి నయనతార దంపతులు బయటపడతారా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube