కాంతార.తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో కూడా ఈ పేరు మారుమోగిపోతోంది.ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మేనియానే కనిపిస్తోంది.మొదట కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతూ రికార్డుల స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
కాగా ఇప్పటికే ఈ సినిమా పలు సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాను హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కర్ణాటక లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.కర్ణాటకలో హోంబలే సంస్థ నిర్మించిన సినిమాలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ఈ సినిమా రికార్డును సృష్టించింది.
అంతేకాకుండా ఈ విషయంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ 2 సినిమా రికార్డును బద్దలు కొట్టింది.

అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టడమే మాత్రమే కాకుండా ఇంతకుముందు సినిమాల కలెక్షన్స్ ని అధిగమిస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి.ఈ సినిమాతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.ఇది ఇలా ఉంటే ఈనెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది.ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలు కేవలం వారం రోజులు మాత్రమే థియేటర్లో ఆడుతుండగా ఈ సినిమా మాత్రం విడుదల పది రోజులు దాటుతున్న కూడా ఇంకా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా కాంతార సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.







