ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ తో పాటు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లు నయన్, విగ్నేష్.ఈ జంట పేర్లు స్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే నయనతార,విగ్నేష్ శివన్ లు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదే విషయాన్ని క్యూట్ కపుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే నయనతార తన ఇద్దరు మగ పిల్లలకు పేర్లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది.ఇదే విషయాన్ని ఆమె భర్త విగ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆ పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టినట్లు విగ్నేష్ తెలిపారు.ఇకపోతే నయనతార అభిమానులు ఆ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి అని ఆరా తీయగా తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది.
ఇక ఉలగం అంటే ప్రపంచం అని అర్థం వస్తుంది.

అంటే నయనతార ట్విన్స్ ల పేర్లకు అర్థం జీవితం,ప్రపంచం.కాగా సోషల్ మీడియాలో కొత్తగా తల్లిదండ్రులు అయినా ఈ కోలీవుడ్ జంటకు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్,కోలీవుడ్ సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే పలువురు బాలీవుడ్,టాలీవుడ్ హీరో హీరోయిన్లు స్పందిస్తూ కామెంట్స్ కూడా చేశారు.ఖైదీ ఇలా ఉంటే ఈ కోలీవుడ్ జంట పెళ్లికి ముందు ఆరేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన తర్వాత ఈ ఏడాది అనగా 2022 జూన్ 9న వివాహ బంధంతో ఒకటయ్యారు.







