తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి నయనతార ( Nayanatara ) ఒకరు.ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అగ్రతారగా ఓ వెలుగు వెలగడమే కాకుండా అందరికంటే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ సంచలనాలను సృష్టిస్తుంది.
ఇక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కూడా నయనతార ఏ మాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా నిలబడినటువంటి నయనతారకు ఒకప్పుడు దర్శకుల నుంచి చేదు అనుభవాలే ఎదురయ్యాయని తెలుస్తోంది.
కెరియర్ మొదట్లో ఎంతో మంది దర్శకులు ఈమెను అవమానించారట నీకు నటనే చేతకాదు వెళ్ళిపో అంటూ ఈమెను దారుణంగా అవమానించారని తెలుస్తుంది.ఈ విధంగా ఎంతో మంది దర్శకుల నుంచి అవమానాలు ఎదుర్కొన్నటువంటి ఈమె నేడు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.నయనతార కు మొదట పార్తీపన్( Parthiban ) డైరెక్టర్ అవకాశం కల్పించారట.అయితే ఈమెను ఆడిషన్స్ కి రమ్మని చెప్పగా కేరళ నుంచి చెన్నై రావడానికి బస్సులో ప్రయాణం చేయాల్సి రావడంతో ఆలస్యమైంది.
దీంతో డైరెక్టర్ ఆమెకి ఫోన్ చేసి ఇక్కడ నీవు ఆడిషన్స్ కి రావాల్సిన అవసరం లేదని చెప్పారట.
ఇలా మొదటి సినిమా అవకాశం ఆడిషన్స్ కి వెళ్లకనే కోల్పోయిందని తదుపరి ఈమె హీరో శింబు ( Shumbu ) తో కలిసి తొట్టి జయ అనే సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.ఈ సినిమా డైరెక్టర్ తనని ఆడిషన్స్ కోసం రమ్మన్నారు.ఇలా ఈ సినిమా కోసం ఆడిషన్స్ చేయగా అది చూసినటువంటి డైరెక్టర్ నీకు సినిమాలలో నటించడమే రాదు ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తనని అవమానించారని తెలుస్తుంది.
ఇలా వరుసగా అవమానాలను ఎదుర్కొన్నటువంటి నయనతార అనంతరం అయ్యా సినిమాను ( Ayya movie )శరత్ కుమార్ తో కలిసి నటించే అవకాశం అందుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వస్తున్నాయి.