మిలటరీ వస్తువుల స్మగ్లింగ్: భార్యతో సహా చైనా సంతతి యూఎస్ నేవి అధికారి అరెస్ట్

ఆర్ధిక, సైనిక, సాంకేతిక రంగాల్లో తమకు చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచివుందని అమెరికా గత కొన్నేళ్లుగా ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విద్య, ఉపాధి అవకాశాల కోసం వస్తున్న చైనీయులపై పెద్దన్న డేగ కన్ను వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇంటి దొంగల నుంచే అగ్రరాజ్యం ఇబ్బందులను ఎదుర్కొంటోంది.గాలితో నిండి ఉండే మిలటరీ తరహా బోట్లను అక్రమంగా చైనాకు ఎగుమతి చేస్తున్న యూఎస్ నేవి అధికారి అతని భార్యను ఎఫ్‌బీఐ, నేవి అధికారులు గత వారం ఫ్లోరిడాలో అదుపులోకి తీసుకున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ ఫాన్ యాంగ్ జాక్సన్‌విల్లేలోని మారిటైమ్ పెట్రోల్ అండ్ రికనైసెన్స్ వెపన్స్ స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.అలాగే అత్యంత రహస్యమైన యాంటి-సబ్‌మెరైన్‌ విభాగంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

అతని భార్య సైతం అమెరికా నుంచి రక్షణ శాఖకు చెందిన వస్తువులను అక్రమంగా చైనాకు తరలించిందని ఎఫ్‌బీఐ తెలిపింది.గాలితో నిండివుండే బోట్లను చైనాకు తరలించేందుకు గాను ఈ జంట 2,05,000 డాలర్లకు గతేడాది ఒప్పందం చేసుకుందని.

Advertisement

దీని ప్రకారం సెప్టెంబర్ 2018 నుంచి ఈ ఏడాది అక్టోబర్ మధ్యకాలంలో సరకును డెలీవరి చేయాల్సి ఉందని దర్యాప్తులో తేలింది.జి సాంగ్టావ్ అనే చైనీయుడి నుంచి యాంగ్‌కు మూడేళ్లలో 400 ఈమెయిల్స్ వచ్చినట్లుగా దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.

  జి సాంగ్టావ్‌తో పాటు చైనాకు చెందిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అధికారులు లూసియానాలో అదుపులోకి తీసుకున్నారు.సాంగ్టావ్‌ చైనాలోని షాంగై బ్రీజ్ టెక్నాలజీ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ కెంపెనీలో యాంగ్ భార్య చీఫ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లుగా సమాచారం.

కాగా.చైనాలో పుట్టిన యాంగ్ 1999లో అమెరికాకు వలస వచ్చి.2006లో యూఎస్ పౌరసత్వం పొంది నేవిలో చేరి లెఫ్టినెంట్ స్థాయికి చేరాడు.ఈ కేసుకు సంబంధించి యాంగ్ దంపతులను బుధవారం ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు