తెలుగు బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూ మెప్పిస్తున్నారు.అయితే సీరియల్స్ ద్వారా మాత్రమే కాకుండా ఎన్నో బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో నవ్య స్వామి బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని తన పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకుంటున్నారు.ఇక నవ్య స్వామి నటుడు రవికృష్ణ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించడంతో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుండటం వల్ల వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్న వీరి గురించే వచ్చే ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇక బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరుపమ్ గురించి మనకు తెలిసిందే.ఈయన కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
సీరియల్లో ఎంతో అమాయకంగా కనిపించే డాక్టర్ బాబు బయట మాత్రం చాలా సరదాగా ఉంటారని చెప్పాలి.

ప్రస్తుతం తన భార్యతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేయడమే కాకుండా తన పంచ్ డైలాగులతో అందరిపై తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే నవ్య స్వామి డాక్టర్ బాబు ఇలా అందరి పై పంచులు వేయడంతో ఏకంగా ఆయనని ఉద్దేశిస్తూ ఈయన పేరు నిరూపమ్ అని పెట్టాల్సింది కాదు.ఈయనకు పంచ్ పరమానంద అని పేరు కరెక్ట్ గా సరిపోతుంది అంటూ డాక్టర్ బాబుకు అలాంటి పేరు పెట్టేసింది.
ఇలా డాక్టర్ బాబుకు నవ్య స్వామి ఆ పేరు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.







