కొత్త కారు కొన్న నవ్య స్వామి.. రవి కృష్ణ రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ బుల్లితెరకు చెందిన సీరియల్ నటి నవ్య స్వామి.ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి బాగా తెలుసు.

 Navya Swamy Bought A New Car Ravi Krishnas Reaction Should Be Shocked Navya Swam-TeluguStop.com

తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది నవ్య స్వామి.

ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది.

అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.

నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.

గతంలో ఓ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేసింది.  ఓ వెబ్ సిరీస్ లో నటించగా ఇటీవలే ఆ వెబ్ సిరీస్ విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

ఇక గతంలో ఈమె వ్యక్తిగతం గురించి ఒక వార్త బాగా హార్ట్ టాపిక్ నడిచింది.అదేంటంటే.ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో నవ్య స్వామి బాగా సన్నిహితంగా ఉంటుంది.గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.

కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు.

అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.కానీ ఇప్పటికీ వారి మధ్య ఉన్న బంధం ఏంటో బయటకు పడటం లేదు.

నవ్య స్వామి ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా నవ్య స్వామి సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్టు తో బాగా సందడి చేస్తుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Telugu Bigg Boss, Car, Navya Swamy, Ravi Krishna, Tollywood, Web-Movie

అందులో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేసుకుంటుం.తను చేసిన ప్రతి పోస్ట్ కు రవి కృష్ణ వెంటనే లవ్ సింబల్ తో స్పందిస్తూ ఉంటాడు.వారిద్దరి మధ్య ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.

Telugu Bigg Boss, Car, Navya Swamy, Ravi Krishna, Tollywood, Web-Movie

ఇదంతా పక్కన పెడితే తాజాగా నవ్య స్వామి సొంతంగా ఓ లగ్జరీ కారు కొన్నది.ఇక ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.దీంతో ఆ ఫోటో వైరల్ కాక ముందుకే రవి కృష్ణ వెంటనే ఆ కారును తన స్టోరీలో పెట్టి వెంటనే రియాక్ట్ అయ్యాడు.హే కంగ్రాట్యులేషన్స్ రౌడీ ఫెలో.

లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటూ లవ్ సింబల్స్ తో స్పందించాడు.దాంతో నవ్య స్వామి కూడా అంతేగా అంతేగా అంటూ లవ్ సింబల్ పెట్టి స్పందించింది.

ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube