సీనియర్ నటి పవిత్ర లోకేష్ సీనియర్ హీరో నరేష్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఇద్దరికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.“మా” ఎన్నికల సమయంలో నరేష్ అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో… పవిత్ర లోకేష్ కీలకంగా రాణించింది.అప్పటినుండి వీరిద్దరి మధ్య సంథింగ్ ఉన్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి.
ఆ తర్వాత నరేష్ మూడో భార్య .పవిత్ర లోకేష్ పై అనేక కామెంట్లు చేయటం మాత్రమే కాదు బెంగళూరులో ఆమెపై దాడికి కూడా పాల్పడింది.

ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించాక పవిత్ర లోకేష్ మరియు నరేష్ ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటూ వచ్చారు.వీరిద్దరి జంట కృష్ణ మరణించిన సమయంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కొత్త సంవత్సరం నేపథ్యంలో.కేక్ కట్ చేసి పవిత్ర లోకేష్ కి నరేష్ లిప్ కిస్ పెట్టడం జరిగింది.వీడియోలో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు.
నరేష్ అధికారికంగా ప్రకటించాడు.నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
పవిత్రకు ఇది రెండో పెళ్లి.







