ఎక్కడికి పారిపోలేదు అంటూ క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్..!!

మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో హీరో నవదీప్( Navdeep ) పేరు కూడా బయటపడటం తెలిసిందే.ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలియజేయడం జరిగింది.

 Navdeep, The Hero Who Gave Clarity Saying That He Did Not Run Away , Madhapur Dr-TeluguStop.com

ఇదే విషయం మీద ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి నవదీప్ కానీ ఆయన కుటుంబం కానీ అందుబాటులో లేదని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారీ అయ్యాడని అంటూ కామెంట్లు చేశారు.దీంతో హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు కొన్ని గంటల నుండి వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలు విషయంలో హీరో నవదీప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.తాను ఎక్కడికి పారిపోలేదని.హైదరాబాదులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో “బేబీ” ( baby )సినిమా ప్రస్తావన కూడా సిటీ కమిషనర్ సీవీ ఆనంద్( CV Anand ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాలో మాదకద్రవ్యాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.మూవీ మేకర్స్ బాధ్యతతో ఉండాలి.“బేబీ” సినిమా నిర్మాతలకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుడునీ పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube