టేస్టీ తేజతో నాచురల్ స్టార్ నాని... కొత్తగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సెలబ్రిటీలు?

ప్రస్తుత కాలంలో సినీ సెలెబ్రిటీలందరూ కూడా తమ విడుదల కాబోతున్నాయి అంటే విభిన్న రీతులలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబర్స్ తో ఇంటర్వ్యూలో నిర్వహిస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

 Natural Star Nani Using Tasty Teja Craze For His Movie Pramotions , Tasty Teja,-TeluguStop.com

సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ వారితో మాట్లాడుతూ తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ వారితో ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పాల్గొని సినిమాలను ప్రమోట్ చేస్తూ వచ్చారు తాజాగా నాని ( Nani ) కూడా ఇదే బాటలో ప్రయాణం చేస్తున్నారని తెలుస్తుంది.

Telugu Biryani, Hai Naana, Nani, Tasty Teja, Tollywood-Movie

నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న(Hai Naana) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే నాని పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.తాజాగా ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ( Tasty Teja) తో కలిసి కూడా చిట్ చాట్ చేశారని తెలుస్తుంది.

ప్రస్తుతం నాని టేస్టీ తేజతో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను హాయ్ నాన్న టీమ్ విడుదల చేశారు.

Telugu Biryani, Hai Naana, Nani, Tasty Teja, Tollywood-Movie

టేస్టీ తేజ ఫుడ్ వ్లాగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇదే పాపులారిటీతో ఈయన బిగ్ బాస్ ( Bigg Boss )అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో ఏడు వారాల పాటు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసినటువంటి తేజ బయటికి రాగానే బిజీ అయ్యారని తెలుస్తుంది.

ఇలా ఈయన నానితో కలిసి సరదాగా సినిమా విశేషాలను పంచుకోవడమే కాకుండా ఆయన చేసినటువంటి బిర్యాని రుచి కూడా నానికి చూపించారు.ఇలా వీరిద్దరూ కలిసి బిర్యాని తింటూ ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏది ఏమైనా తమ సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో సెలబ్రిటీలు సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube