అఫీషియల్: గేమ్ ఛేంజర్ జరగండి పాట విడుదల వాయిదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan ) హీరోగా శంకర్ ( Shankar ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ) .ఈ సినిమా వచ్చే వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

 Game Changer Movie Jaragandi Song Post Poned, Ramcharan, Game Changer, J-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జరగండి అంటూ సాగే సాంగ్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేస్తామంటూ ఇదివరకు ప్రకటించారు.

ఈ పాట దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నామని తెలియజేయడంతో ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే గత రెండు రోజులుగా ఈ పాట విడుదల వాయిదా కానుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోవడంతో తప్పకుండా ఈ పాట విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం నుంచి జరగండి ( Jaragandi Song ) అనే పాటను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ పాట వాయిదా పడడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.ఈ పాటకు సంబంధించి ఆడియో డాక్యుమెంటేషన్ లో పలు రకాల సమస్యలు తలెత్తాయని అందుకే ఈ పాటను వాయిదా వేస్తున్నామంటూ తెలియజేశారు.అయితే తిరిగి ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామంటూ మేకర్స్ అధికారికంగా తెలియజేయడంతో రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube