ఎంసిసి ఉల్లంఘనల పై అప్రమత్తంగా ఉంటూ నివేదికలు వెంటనే సమర్పించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్రమ నగదు, మధ్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు,1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు మొదలగు నివేదికలను ప్రతిరోజు సకాలంలో సమర్పించాలని రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (డా .జగదీష్ సొంకర్ ) అన్నారు.

 Vigilance And Reporting Of Mcc Violations Should Be Done Promptly , Sircilla Rur-TeluguStop.com

శనివారం సిరిసిల్ల లను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్నికల సమీకృత ఫిర్యాదులు పర్యవేక్షణ కేంద్రం ను రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ( Rajanna Sirisilla ) ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (డా .జగదీష్ సొంకర్ )కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి పరిశీలించారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం లో జీపీఎస్ మానిటరింగ్, 1950 కాల్ సెంటర్, కంట్రోల్ రూం, సి – విజిల్, ఎంసీఎంసి, సోషల్ మీడియా విభాగాల పనితీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఎన్నికల సాధారణ పరిశీలకులకు వివరించారు.ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం పనితీరు పట్ల సాధారణ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

సందర్శనలో సాధారణ పరిశీలకుల వెంట జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ), జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా చేనేత జౌళి అధికారి సాగర్ తదితరులు ఉన్నారు.అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ సిరిసిల్ల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి… ఎన్నికల రిజిస్టర్ ల నిర్వహణ ను పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube