ఈరోజు న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.నాని పుట్టినరోజు సందర్భంగా ఎన్నో శుక్రవారాలు మళ్లీమళ్లీ పుట్టానంటూ నాని తన పుట్టినరోజు గురించి కామెంట్ చేశారు.
క్లాప్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నాని సంవత్సరం పాటు ఆర్జేగా కూడా పని చేశారు.అష్టాచమ్మాలో నాని హీరోగా నటించగా ఆ సినిమా సక్సెస్ సాధించడంతో నాని జాతకమే మారిపోయిందని చెప్పాలి.
ప్రస్తుతం నాని పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మినిమం గ్యారంటీ హీరోగా నాని పేరు తెచ్చుకున్నారు.దసరా సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోందని తెలుస్తోంది.
నాని వరుసగా ఎనిమిది హిట్లు సాధించిన హీరోగా ఈ అరుదైన రికార్డ్ నానికి మాత్రమే సొంతమని తెలుస్తోంది.భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి నాని మార్కెట్ పెరుగుతోంది.

పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని ఇతర హీరోలతో సైతం సన్నిహితంగా మెలుగుతారు.ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది హీరోలలో నాని ఒకరు.అంటే సుందరానికి సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నాని తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు.నానికి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

నాని హిట్ సిరీస్ లో ఒక సినిమాలో నటిస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది.నాని కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.స్వయంకృషితో నాని అంతకంతకూ ఎదిగారనే సంగతి తెలిసిందే.నాని కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.







