నాటు నాటు రీసౌండ్ మామ్మూలుగా లేదుగా... టెస్లా కార్ ఓనర్స్ సెలబ్రేషన్స్!

Natu Natu Resound Is Not Usual Tesla Car Owners Celebrations , Rajamouli,Tesla Car, Dance, Lightshow,Oscar Award,Natu Natu Song, Presentation,RRR, Latest News, Viral Latest, News Viral, Social Media, Viral Video

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) రూపొందించిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఆ సినిమాలోని నాటు నాటు పాట( Natu Natu song ) ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో తెలియంది కాదు.

 Natu Natu Resound Is Not Usual Tesla Car Owners Celebrations , Rajamouli,tesla C-TeluguStop.com

ఎన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ పాట ఈమధ్య ఆస్కార్ అవార్డు పొందిన సంగతి అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో భాషాభేదాలకు అతీతంగా వరల్డ్ వైడ్‌గా ఎక్కడ చూసిన నాటు నాటు క్రేజ్ కనిపిస్తోంది.

ఫారినర్స్ సైతం ఈ పాటకు స్టెప్పులు వేస్తూ పండగ చేసుకుంటున్నారు.

అవును, నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడం పట్ల వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఎవరికి తోచిన రీతిలో వారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే అమెరికాలోని టెస్లా కార్ ఓనర్స్ సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాటు నాటు పాట మ్యూజిక్ బీట్స్‌కు పార్కింగ్ ఏరియాలో ఉన్న వందలాది టెస్లా కార్ హెడ్ లైట్స్‌, టెయిల్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

టెస్లా కార్లలో ఉండే లైట్‌షో అనే ఫీచర్‌ను ఉపయోగించి చేసిన ఈ వీడియో ఆర్ఆర్ఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సదరు వీడియోను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఈ క్రమంలో ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకురాగా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా చరిత్ర తిరగ రాసింది.

అంతేకాకుండా రెండు నెలల క్రితం జపాన్ లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ ఇంకా వసూళ్ల సునామి సృష్టిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube