సెయింట్ లూయిస్‌లో అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ సాయం

సెయింట్ లూయిస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న అగ్ని మాపక సిబ్బందికి సాయం చేసింది.

సెయింట్ లూయిస్‌లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికి ఫిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది.కరోనాపై పోరులో అగ్ని మాపక సిబ్బంది కూడా ముందుండి తమ వంతు పోరాటం చేస్తున్నారు.

ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను ప్రోత్సాహించేందుకు నాట్స్ వారికి ఆహార పంపిణీ చేసింది.ఉద్యోగులందరికీ నాట్స్ ఫిజ్జా లంచెస్ ఏర్పాటు చేసింది.

నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం సమన్వయకర్త నాగ శ్రీనివాస్ శిష్ట్లా తో పాటు నాట్స్ వాలంటీర్లు అప్పలనాయుడు గండి, శివ కృష్ణ మామిళ్లపల్లి, శ్రీరామ్ కారుమూరి, రాజశేఖర్, ఈశ్వర్ యడ్లపల్లి, వెంకట్ పసుపులేటి, అయినగుండ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.డాక్టర్ సుధీర్ అట్లూరి ఈ పంపిణీకి తన వంతు సాయాన్ని అందించారు.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు