ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ డ్యామ్ కు జాతీయ జెండా రంగులు అమర్చడంతో క్రస్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు మూడు రంగుల జెండా రూపంలో సందర్శకులను ఆకర్షిస్తోంది.సాగర్ కు భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో 26 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్ర-తెలంగాణ నుంచి పర్యటకులు భారీగా తరలివస్తుండటంతో సాగర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.







