నాథన్ లియోన్ సరికొత్త రికార్డ్.. ఆసియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా, ఇండోర్ వేదికగా జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లోనే భారత జట్టు బోల్తా పడింది.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా, ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని సమర్థంగా ఎదుర్కోలేక పోయింది.

 Nathan Lyon Is A New Record.. Foreign Bowler Who Has Taken Most Wickets On Asia-TeluguStop.com

స్పిన్ పిచ్ పై ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్ లియోన్, మాథ్యూ కుహ్నేమన్ లు చెలరేగడంతో టీమిండియా 109 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

పుజారా వికెట్ తీసిన లియోన్, షేన్ వార్న్ రికార్డును సమం చేసి.రవీంద్ర జడేజా వికెట్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు.దీనితో ఆసియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్ గా నాథన్ లియోన్ ఓ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

తాజాగా 129 వికెట్స్ తీసి లియోన్ మొదటి స్థానంలో ఉండగా, 127 వికెట్ల తో రెండో స్థానంలో ఉన్నాడు స్పిన్నర్ షేన్ వార్న్.ఇక న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డానియల్ వెటోరి 98 వికెట్లు తీసి మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డెయిల్ స్టెయిన్ 92 వికెట్లు తీసి నాలుగో స్థానంలో, వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ 77 వికెట్లు తీసి ఐదో స్థానంలో నిలిచారు.ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రవీంద్ర జడేజా వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి ట్రావిస్ హెడ్ (9) ఎల్ బి డబ్ల్యు అయ్యాడు.అంపైర్ నాటౌట్ ప్రకటించగా.

డీఆర్ఎస్ తో మొదటి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.తరువాత మార్నస్ లబుషెన్ అవుట్ అయినా, నో బాల్ కావడం చేత బతికిపోయాడు.24 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 84/1.లబుషేన్ (19), ఉస్మాన్ ఖవాజా (43) పరుగులలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube