తాజాగా ఏర్పడిన సూర్యగ్రహణం( Solar Eclipse ) ఉత్తర అమెరికాలో ఖగోళం వింతగా భావిస్తున్నారు.అమెరికా దేశంతో పాటు కెనడా, మెక్సికో దేశాల్లోని నగరాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించింది.
ఇక ఈ సూర్యగ్రహణం సంబంధించి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్( NASA ) లో శాస్త్రవేత్తలతో పాటు పలు విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక తాజాగా ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం దాదాపు నాలుగు నిమిషాలకు పైగా జరిగింది.
దీంతో సూర్యుడిని చంద్రుడు నాలుగు నిమిషాల పాటు పూర్తిగా కప్పేసాడు.ఇకపోతే ఖగోళ వింతగా భావించిన ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించే అదృష్టం కేవలం ఉత్తర అమెరికా వాసులకు మాత్రమే దక్కింది.
ఈ సంఘటనతో ఆదేశ ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఎదురుచూశారు.ఇకపోతే సూర్యగ్రహణం ఏర్పడిన సమయం రాగానే వారందరూ వారి సెల్ ఫోన్ లలో వచ్చిన అరుదైన సూర్యగ్రహణాన్ని బంధించారు.దాంతో సోషల్ మీడియా( Social Media )లో అనేక ఫోటోలు, వీడియోలు సంపూర్ణ సూర్యగ్రహానికి సంబంధించినవి వైరల్ గా మారాయి.
ఇకపోతే అమెరికాలోని దాదాపు పది మిలియన్లకు పైగా ప్రజలు ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడగలిగారు.ఇక అక్కడి కాలంనా ప్రకారం ఉదయం 11 : 07 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం( Total Solar Eclipse ) ఏర్పడింది.దీంతో మెక్సికో( Mexico )లోని పసిఫిక్ తీరాన్ని పూర్తిగా సూర్యగ్రహణం అంధకారంలోకి నెట్టింది.
ఆ తర్వాత అమెరికాలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వ్యాపించింది.ఇంకెందుకు ఆలస్యం ఈ సంపూర్ణ గ్రహణం సంబంధించి వీడియోలని చూడండి.