వాట్సప్ లో మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే..?

ప్రపంచవ్యాప్తంగా వాట్సప్( Whatsapp ) కు ఎంత మంచి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే.అందుకే వాట్సప్ తమ యూజర్ల భద్రత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లను పరిచయం చేస్తూ సేవలను మరింత సులభతరం చేస్తోంది.

 Whatsapp To Introduce Status Notifications Feature Soon,whatsapp,status Notifica-TeluguStop.com

గతంలో కంటే మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది.ఈ క్రమం లోనే మరో సరికొత్త ఫీచర్ ను యూజర్ లకు పరిచయం చేసేందుకు సన్నద్దమవుతోంది.

ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే.యూజర్ తన కాంటాక్ట్స్ లోని సభ్యులతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుగా వాట్సప్ సేవలను నోటిఫికేషన్ల( Whatsapp Notifications ) రూపంలో పంపించే వెసులుబాటును తీసుకురానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కాంటాక్ట్స్ లోని సభ్యులు అందరూ నుంచి స్టేటస్ నోటిఫికేషన్లు పొందవచ్చు.అంటే కాంటాక్ట్స్ లో చూడని స్టేటస్( Whatsapp Status ) లను నోటిఫికేషన్ల రూపంలో అలెర్ట్ పొందొచ్చు.అయితే ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత వాట్సప్ యూజర్ లకు అందుబాటులోకి రానుంది.కాంటాక్ట్స్ లో తమకు నచ్చిన వారితో చాటింగ్( Chatting ) కోసం కూడా నోటిఫికేషన్లు పంపించే ఫీచర్ ను కూడా వాట్సాప్ పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దీనికి సంబంధించి వాట్సప్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.

సజెస్టెడ్ చాట్ ఫీచర్( Suggested Chat Feature ) కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని, ఈ ఫీచర్ చాట్ లిస్ట్ లో దిగువన ఉండనుందని టెక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ప్రస్తుతం వాట్సాప్ లో కొత్తగా వస్తున్న ఫీచర్ లతో స్టేటస్ అప్డేట్ ఉంటుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube