నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును ప్రకటించారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో సునీతా లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్ అందించారు.ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలోనే ఆమెకు బీ ఫామ్ అందించారు.
అదేవిధంగా మదన్ రెడ్డికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పెండింగ్ లో ఉన్న స్థానాలకు ఒక్కొక్కరికి కేసీఆర్ బీ ఫామ్ లను అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీ ఫామ్ అందించిన విషయం తెలిసిందే.







