ఈ మధ్య కాలం లో పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) ని పెళ్ళాడి తరచూ వార్తల్లో నిలుస్తున్న సీనియర్ నటుడు నరేష్.ఆరు పదుల వయస్సు దాటినా ఈయన 40 ఏళ్ళ మహిళని పెళ్లాడడం తో ఈయన పై సోషల్ మీడియా లో వచ్చిన నెగటివిటీ మామూలుది కాదు.
ఈ పెళ్ళికి ముందు వరకు నరేష్ పై ఆడియన్స్ లో ఒక మంచి అభిప్రాయం ఉండేది.ఎందుకంటే నటుడిగా ఆయనకీ వంకలు పెట్టలేం, ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో నరేష్ ఎదో ఒక పాత్రలో మెరవాల్సిందే.
ఆయన డిమాండ్ అలాంటిది, అలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈయన తన మూడవ భార్య రమ్య రఘుపతి పై ఆరోపణలు చెయ్యడం.ఆమె నేను విడాకులు ఇవ్వను అంటూ కోర్టు మెట్లు ఎక్కడం,ఇత్యాది సంఘటనలు మొత్తం సంచలనం రేపాయి.
ఒకానొక దశలో రమ్య రఘుపతి నరేష్ మరియు పవిత్ర ఉంటున్న హోటల్ రూమ్ కి వెళ్లి వాళ్ళిద్దరిని చెప్పుతో కొట్టాలని కూడా చూసింది.ఆ వీడియోలు ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉన్నాయి.

అయితే తనపై వచ్చిన ఈ నెగటివిటీ మొత్తాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచించిన నరేష్ పవిత్ర తో తన ప్రేమాయణం గురించి ‘మళ్ళీ పెళ్లి'( Malli Pelli ) అనే సినిమా తీసి రీసెంట్ గానే విడుదల చేసారు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత MS రాజు( MS Raju ) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేకపోయింది.మొదటి రోజు ఈ చిత్రానికి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇది పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్.కానీ రెండవ రోజు ఈ సినిమాకి కనీసం థియేటర్స్ రెంట్స్ రికవరీ అయ్యేంత వసూళ్లు కూడా రాలేదు.
నెగటివిటీ ని క్యాష్ చేసుకోవాలని చూసిన నరేష్ ని జనాలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు.ఈ సినిమా ప్రొమోషన్స్ లో నరేష్( Naresh ) ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఆయన చెప్పినట్టుగా 15 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యి ఉండదు కానీ, 8 కోట్ల రూపాయిల బడ్జెట్ మాత్రం కచ్చితంగా అయ్యుంటుంది అని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.థియేటర్స్ నుండి ఏమి రాకపోయినా, డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ద్వారా ఆయన పెట్టిన బడ్జెట్ రికవర్ అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు.ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో ఆదరించకపోయినా, ఓటీటీ లో టైం పాస్ కోసం చూస్తుంటారు ఆడియన్స్, ఆ విధంగా క్లిక్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకొని నాల్గవ రోజులోకి అడుగుపెట్టింది.
ఈ నాలుగు రోజులకు గాను ఈ సినిమా సున్నా షేర్ ని సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు, వచ్చిన గ్రాస్ కి టాక్సులు , థియేటరే రెంట్స్ మరియు GST ఇలా అన్నీ కలిపితే ఒక్క రూపాయి కూడా షేర్ వసూళ్లు రాలేదని తెలుస్తుంది.







