గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్( Naresh ) నటి పవిత్ర లోకేష్ ల( Pavitra Lokesh ) పేర్లు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.తరచూ ఈ జంటకు సంబంధించి ఏదో ఒక విషయం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ జంట రిలేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
ఇదే విషయాన్ని ఈ జంట ఈ ఏడాది ఆరంభంలో స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే వీరు పెళ్లి చేసుకొని ఒక్కటి అవ్వాల్సి ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అందుకు అడ్డుపడుతోంది.

ఇప్పటికే వీరి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్లి( Malli Pelli Movie ) అనే సినిమా కూడా విడుదలైన విషయం తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం నరేష్ అలాగే పవిత్ర లోకేష్ ఎవరికి వారు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్‌గా మారిపోయాడు నరేష్.కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్న ఇతడు వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.వైవాహిక జీవితం విషయంలో మాత్రం ఇప్పటికీ ఈయన ఎన్నో ఒడిదుడుకులను అవమానాలను కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

అయితే ప్రస్తుతం నరేష్ నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్‌ని ఒక ఈవెంట్‌కి గెస్టులుగా పిలిచారు.నరేశ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేజీపై సన్మానించారు.
అనంతరం ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నారు.50 ఏళ్లు అయిపోయింది.పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో రకరకాల ఒడిదొడుకులు.
గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను అని నరేష్ తెలిపారు.అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది.
అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.