సీనియర్ నటుడు నరేష్ ( Naresh )మరియు పవిత్ర లోకేష్( Pavitra lokesh ) లు సహ జీవనం సాగిస్తున్నారు.ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మూడవ భార్య నుండి నరేష్ విడాకుల కోసం వెయిట్ చేస్తున్నాడు.ఈ నేపథ్యం లో వీరిద్దరు కూడా కలిసే ఉంటున్నారు కానీ పెళ్లి పీఠలు ఎక్కలేదు.
ఆ మధ్య మళ్లీ పెళ్లి అనే సినిమా( Malli Pelli Movie ) ను వీరిద్దరు కలిసి చేశారు.ఇద్దరూ కూడా మళ్లీ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సోషల్ మీడియా( Social media )లో పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా మరోసారి నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ఇండస్ట్రీ లో ఒక సినిమా తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.కొత్త దర్శకుడు ప్రస్తుతం వీరి కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీ ని రెడీ చేయడం జరిగిందట.ఆ కథ లో కూడా ఇద్దరికి అంతకు ముందు పెళ్లి అవుతాయి.
వారు పిల్లల కోసం ఎలా కలిశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపించబోతున్నారు.
ప్రేమ, బ్రేకప్ వంటివి ఈ సినిమా లో చూపిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ఈ కథ కు బాగా సెట్ అవుతారు అని ఒక ప్రముఖ నిర్మాత కూడా ఈ సినిమా ను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు అంటున్నారు.మొత్తానికి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాలు మరియు రాబోతున్న సినిమాలకు సంబంధించి అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంది.
అందుకే వీరిద్దరు ఎక్కువ సినిమా ల్లో కలిసి నటించాలని కోరుకుంటున్నారు.అదే జరిగితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే అవకాశాలు ఉన్నాయి.పెద్ద ఎత్తున నరేష్ మరియు పవిత్ర లోకేష్ ల విషయం లో ఉన్న సోషల్ మీడియా టాక్ వారి పెళ్లి అయ్యే వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.