యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ పోతున్నాడు.అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.
మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేసి రిలీజ్ మాములుగా ఉండదు అని నిరూపించారు.కానీ ఈ నెలలోనే రిలీజ్ కావాల్సిన సలార్ సినిమాను వాయిదా వేసి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించారు.
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు వాయిదా అంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.మరో కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.బాలీవుడ్ లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 350 కోట్లకు పైగానే అమ్ముడైనట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.అలాగే శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ సంస్థ స్టార్ గ్రూప్ వారు దక్కించుకోగా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.మొత్తంగా రిలీజ్ ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ డీల్ జరిగి ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచేసాయి.
మరి ఇంతమేర డీల్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.