సికె ఇంఫిని సమర్పించు సీకె ఇంఫిని ఎంటర్త్సైన్మెంట్స్ బ్యాన్సర్ లో భానూరి చంద్రకాంత్ రెడ్డి నిర్మాతగా నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘సరసాలు చాలు’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.
ఇటీవల విడుదలైన ఈ టైటిల్ గ్లిమ్ప్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా అందంగా వుందని మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేశారు.ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ… సరసాలు చాలు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ. కామెడీ మరియు రొమాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ అందరిని ఆలోచింపజేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి.
ప్రతి జంటకు కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోందని తెలిపారు.పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న మా సినిమా ను దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము, మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్.2 చర్చల్లో ఉంది, త్వరలో ఆ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నాము అన్నారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య, సంజన సారధి, వెంకట్, దివ్యవాణి, వెంకటేష్ కాకమాను తదితరులు.
టెక్నీషియన్స్:
క్రియేటివ్ ప్రొడ్యూసర్: జైకాంత్ (బాబి), కెమెరామెన్: రోహిత్ బచ్చు, సంగీతం: భారత్ మాచిరాజు, ఎడిటర్: అశ్వత్ శివకుమార్, కో.డైరెక్టర్: నితిన్ లింగుట్ల, నిర్మాత: చంద్రకాంత్ రెడ్డి, డైరెక్టర్: డాక్టర్ సందీప్ చేగురి.