మళ్లీ లాక్ డౌన్ ? సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ?

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే రీతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది.

కరోనాను జనాలు అంతగా సీరియస్ గా తీసుకోకపోవడం, తమను ఆ వైరస్ ఏం చేస్తుంది అనే నిర్లక్ష్యంతో సామాజిక దూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్న వంటి పరిణామాల నేపథ్యంలో ఈ వైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది.ముఖ్యంగా మహారాష్ట్ర , తమిళనాడు, పంజాబ్ ఇలా ఏడు రాష్ట్రాల్లో కేసు తీవ్రత రోజురోజుకు పెరిగి పోతుండటంతో ఆయా రాష్ట్రాలు సొంతంగానే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనతో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా నిత్యం పది వేల కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దీనికితోడు పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి.ఇటువంటి పరిణామాల నేపథ్యయంలో ఇప్పుడు కేంద్రం సీరియస్ గా దృష్ట్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించాలని పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ నిబంధనలు అమలు సడలింపులు వంటి విషయాలతోపటు కరోనాాా ను అదుపులోకి తీసుకు వచ్చే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశం నిర్వహించాలని చూస్తున్నారు.

Advertisement

ఈ నెల 16, 17 వ తారీకుల్లో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి లాక్ డౌన్ విధించాలని, అలాగే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.ఒక వైపు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది.

చాలా రాష్ట్రాలు వాటి కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించకుండా కేంద్రం ఏం చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ ... వీటిపై క్లారిటీ 
Advertisement

తాజా వార్తలు