చంద్రబాబు ని ఎందుకు అరెస్ట్ చేయడంలేదో చెప్పిన జేసీ ?

తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా వైసిపి నాయకులపైన జగన్ పైన, తనదైన శైలిలో విమర్శలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం నేరం చేయకపోయినా ఎవరినైనా అరెస్ట్ చేయించగలరని ఆయన వ్యాఖ్యానించారు.ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నారు.

కానీ అశ్విత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది తనకు తెలియదని, దీనిపై న్యాయపరంగా పోరాడుతామని ఆయన చెప్పారు.వైసీపీ ప్రభుత్వం కక్ష ధోరణి తో ముందుకు వెళ్తోంది అని, అధికారులు కూడా జగన్ చెప్పిన మాటలు వింటూనే ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ గురించి కూడా ప్రస్తావించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో నే చంద్రబాబు, లోకేష్ ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, చెప్పుకొచ్చారు.

Advertisement

చంద్రబాబును అరెస్టు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేయకుండా ఆయన చుట్టూ ఉన్న కీలకమైన నాయకులందరినీ అరెస్టు చేయించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, అలాగే చంద్రబాబును ఒంటరి చేయాలి అనే విధంగానే జగన్ ముందుకు వెళుతున్నారని జేసీ చెప్పుకొచ్చారు.అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో అసలు సూత్రధారిని వదిలిపెట్టారని ఆరోపించారు.

మోసపూరితంగా వ్యవహరించిన అశోక్ లేలాండ్ కంపెనీ, దానికి మధ్యవర్తిత్వం వహించిన ముత్తూను విచారణ చేయకపోడంతోనే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తుందని అర్థమవుతుంది అంటూ జేసీ దివాకర్ రెడ్డి నేడు పవన్ రెడ్డి ఆరోపించారు.బ్రిటిష్ కంటే ఘోరమైనది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అని, మావోడు ఎవరిని లెక్క చేయడు అంటూ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ ఓ సి, ఫేక్ ఇన్సూరెన్స్ సృష్టించడం, బీఎస్ 3 వాహనాల విషయం తదితర కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేశారు.ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు