దారుణంగా నిరాశపర్చిన 'నరసింహ నాయుడు' రీ రిలీజ్ వసూళ్లు..కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రాబట్టలేదుగా!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘నరసింహ నాయుడు( Narasimha Naidu) ‘ చిత్రానికి ఒక చరిత్ర ఉంది.అప్పటి వరకు ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమా దశ ని మార్చేసిన చిత్రం ఇది.

 Narasimha Naidu Re-release Collections Details, Narasimha Naidu, Tollywood, Bala-TeluguStop.com

ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకులు అయినా చూసి ఎంజాయ్ చెయ్యగలరు.రోమాలు నిక్కపొడుచుకునే యాక్షన్ సన్నివేశాలకు అసలు కొదవే లేదు.

కేవలం నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టమైన సినిమా ఇది.అప్పట్లో తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని కూడా పెంచింది ఈ చిత్రం.ఆరోజుల్లో ఈ చిత్రం మొట్టమొదటి 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.అంతే కాదు వందకి పైగా కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి సినిమా కూడా ఇదే.

Telugu Balakrishna, Balakrishna Day, Simha, Ntr Fans, Simran, Tollywood-Movie

అలాంటి సినిమాని బాలయ్య( Balakrishna ) పుట్టిన రోజు సందర్భంగా, 4K HD క్వాలిటీ కి రీ మాస్టర్ చేయించి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.రెస్పాన్స్ ఒక రేంజ్ లో వస్తుందని అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్.కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో డిజాస్టర్ రేంజ్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.ఈ చిత్రం రీ మాస్టర్ చేయించడానికి అయిన ఖర్చు అక్షరాలా 20 లక్షల రూపాయిలు.

క్వాలిటీ కూడా అదిరిపోయిందని సినిమాని చూసిన ప్రేక్షకుడు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.కానీ ఈ సినిమా మొదటి రోజు రాబట్టిన గ్రాస్ 20 లక్షల రూపాయిల లోపే ఉంటుందట.

ఇది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం.బాలయ్య కెరీర్ లోనే కాదు, మన తెలుగు సినిమా మార్కెట్ ని సరికొత్త బెంచ్ మార్క్ వైపు పరుగులు తీసేలా చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లో ఇంత తక్కువ వసూళ్లు వస్తాయని ఎవ్వరూ కూడా ఊహించలేకపోయారు.

Telugu Balakrishna, Balakrishna Day, Simha, Ntr Fans, Simran, Tollywood-Movie

ఈ సినిమా రీ రిలీజ్ వైఫల్యం అవ్వడానికి కారణం కచ్చితంగా పబ్లిసిటీ లోపించడం వల్లే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.అసలు ఈ చిత్రం విడుదల అవుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదట.దానికి తోడు సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ రెండు గా చీలిపోయి ఎన్టీఆర్ ఫ్యాన్స్( Jr ntr ) మరియు బాలయ్య ఫ్యాన్స్ గా గొడవలు చేసుకోవడం కూడా యూనిటీ ని దెబ్బ తీసింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఎందుకంటే గత ఏడాది విడుదలైన బాలయ్య ‘చెన్నకేశవ రెడ్డి‘ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.

ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తగా అన్నీ ప్రాంతాలకు కలిపి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.అప్పట్లో అంత వసూళ్లను రాబట్టి ఇప్పుడు ఇలా చతికిల పడడానికి కారణం నందమూరి ఫ్యాన్స్ లో యూనిటీ లోపించడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube