మొన్నటివరకు రాజకీయంగా మంచి జోష్ లో కనిపించిన ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ముఖ్యంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానాన్ని దక్కించుకోవడం, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది టిడిపి అభ్యర్థికు మద్దతు తెలపడం , వారిని సస్పెండ్ చేయడం తదితర పరిణామాలతో రాజకీయంగా టిడిపి నుంచి ఎన్నో విమర్శలు వైసిపి ఎదుర్కొంటుంది.

తాజాగా వైసీపీలో తలెత్తిన పరిణామాలపై ఆ పార్టీ రెబల్ ఎంపీగా గుర్తింపు పొందిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) స్పందించారు .ఈ మేరకు జగన్ కు అనేక సూచనలు చేశారు.ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఆరోపణలు చేశారు .వెంటనే ఆయన్ను మార్చకపోతే వైసిపి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని సూచించారు .మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంచివారైనా , 1995లో పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ ఒకరి ప్రమేయం ఎక్కువైన కారణంగా వారు ఎమ్మెల్యేలను అవమానించి అవహేళన చేసినట్లుగా ప్రవర్తించడం వల్ల టిడిపిలో సంక్షోభం తలెత్తిందని, పార్టీ పరిరక్షణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని, ఇదే విషయాన్ని ఇటీవల బాలకృష్ణ షో లో చంద్రబాబు కూడా చెప్పారని రఘురాం గుర్తు చేశారు.వైసీపీలోను ఓ వ్యక్తిని ఒక వర్గం ఎమ్మెల్యేలు అలాగే సంభోదిస్తున్నారని, పరిస్థితి చేయి దాటకముందే ఆ వ్యక్తిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అవుతారని ఇంకా ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చు అంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )ఉద్దేశించి రఘురామ విమర్శలు చేశారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను ప్రేమిస్తున్నారని తక్షణమే జగన్ జాగ్రత్త పడాలని సూచించారు.

ఎమ్మెల్యేలంతా ఆ వ్యక్తికే రిపోర్ట్ చేయాలని సరికాదని, ఉద్యోగులైనా, ఎమ్మెల్యేలైన, మంత్రులకైనా విలువ ఇవ్వకుండా ఆ వ్యక్తినే కలవాలని జగన్ సూచించడం సరైనది కాదు అంటూ రఘురామ అన్నారు.రాజకీయ పార్టీ అంటే ఎవరి సొత్తు కాదని, పార్టీ సభ్యులందరికీ అధినేత జవాబుదారీగా ఉండాలని, తాను ఏ పార్టీ సభ్యుడైన, పార్టీ అధ్యక్షుడు తో పాటు ఆ వ్యక్తి కూడా తనకు జవాబు దారే అని అన్నారు.ఇష్టం వచ్చినట్లుగా పార్టీని నడుపుతాను అంటే కుదరదని , మీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే మీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటానంటే చెల్లుతుంది అంటూ జగన్ కు సూచించారు .పార్టీ నిర్వహణ , విధివిధానాలు ఏమిటో ఎన్నికల సంఘం నియమావళిని ఒకసారి చదువుకోవాలని, నలుగురితో ప్రేమగా ఉంటే సీఎం జగన్ గతంలోలా ఉండవచ్చని అన్నారు.అలాగే జగన్ ( YS jagan )ప్రసంగంలోనూ మార్కు కనిపించిందని, దత్తపుత్రుడు, , దుష్ట చతుష్టయం అన్న వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వినిపించలేదని రఘురామ అన్నారు.