అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది.ఇందులో భాగంగా లోకేశ్ ను దాదాపు ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు.
విచారణ అనంతరం లోకేశ్ మాట్లాడుతూ సీఐడీ అధికారులు చెప్పిన ప్రకారం రెండో రోజు విచారణకు హాజరయ్యానన్నారు.అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారన్న లోకేశ్ తన ఎదుట ఓ డాక్యుమెంట్ పెట్టారన్నారు.
అది ఆయన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ అని చెప్పారు.అయితే ఈ కేసులో నిందితులు కానీ వారి ఐటీ రిటర్న్స్ సీఐడీ చేతిలోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే తనకు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ తో సంబంధం లేదని చెప్పారు.
అంతేకాకుండా వ్యవస్థలన్నింటినీ మ్యానేజ్ చేసి చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్ లో పెట్టారని మండిపడ్డారు.