వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana )పై టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శంఖారావం యాత్రను లోకేశ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సీఎం జగన్( CM Jagan ) ముందు మాత్రం నోరు విప్పలేరని పేర్కొన్నారు.పెన్నులో ఇంకు ఫుల్ గా ఉన్నా అవినీతి కోసం తప్ప, అభివృద్ధి కోసం వాడరని తెలిపారు.
చీపురుపల్లిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆరోపించారు.విజయనగరం జిల్లాను బొత్స కుటుంబం క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తోందని విమర్శించారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ క్యాన్సర్ గడ్డకు రేడియేషన్ ఇవ్వాలన్నారు.విశాఖ( Visakhapatnam )ను దోచుకోవడానికే ఎంపీగా బరిలోకి దిగుతున్నారని ఆరోపణలు చేశారు.