టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టనున్న ప్రజా చైతన్య ‘శంఖారావం’ ( Shankaravam) యాత్రకు సర్వం సిద్ధం అయింది.ఈ మేరకు ఇవాళ శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్చాపురం నుంచి లోకేశ్ యాత్రను ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలిలో శంఖారావం యాత్ర కొనసాగనుంది.ఇందులో భాగంగానే వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలతో లోకేశ్ ముఖాముఖీ అవుతారు.
ఇటీవల లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సాగని ప్రాంతాల్లో శంఖారావం యాత్రను నిర్వహించనున్నారు.కాగా రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశ ( First Phase) లో దాదాపు పదకొండు రోజులపాటు 31 నియోజకవర్గాల్లో ఈ శంఖారావం యాత్రను నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే.